విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్

     Written by : smtv Desk | Sun, Sep 30, 2018, 09:58 AM

విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్

‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ వరుస విజయాలతో టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగాడు విజయ్ దేవరకొండ. తాజాగా విజయ్ నటించిన నోటా చిత్రం విడుదలకు సిద్ధమైంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకులకు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవలే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో విజయ్ రాజకీయనాయకుడిగా కనిపిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది.

అయితే సెన్సార్ బోర్డు ఈ మూవీ తమిళ వర్షెన్‌కు ‘యూ’ సర్టిఫికేట్ ఇచ్చింది. దీనిపై విజయ్ ఓ కామెంట్ చేశాడు. ‘తమిళ్‌లో ‘ఏ’ సర్టిఫికేట్‌ అనుకుంటే ‘యూ’ వచ్చింది.. మరి నాకు ఇష్టమైన తెలుగు సెన్సార్‌ బోర్డ్‌ ఏ సర్టిఫికేట్‌ ఇస్తుందో చూడాలి’ అంటూ విజయ్ ట్వీట్టర్ లో ఓ పోస్ట్ చేశాడు. విజయ్ ‘అర్జున్‌ రెడ్డి’ సమయంలో సెన్సార్‌ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. కాగా ‘నోటా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను సెప్టెంబర్‌ 30న విజయవాడ, అక్టోబర్‌ 1న హైదరాబాద్‌లో జరగనుంది.

Untitled Document
Advertisements