నారా లోకేశ్ ట్వీట్ వైరల్

     Written by : smtv Desk | Sun, Sep 30, 2018, 12:04 PM

నారా లోకేశ్ ట్వీట్ వైరల్

నారా లోకేశ్ రీసెంట్ గా చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఆ ట్వీట్ చేసిన లోకేశ్ ను తెగ ఆడుకుంటున్నారు. ముందు ఆయన ఏం ట్వీట్ చేశాడో చూద్దాం. తర్వాత ఆయన్ను ఎలా ఆడుకున్నారో అదీ చూద్దాం.

నవ్యాంధ్రలో మళ్ళీ చంద్రోదయమే అంటున్న అన్నగారు. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆవిష్కృతమైనది ఈ కమనీయ దృశ్యం, అని ట్వీట్ చేశారు .

ఏ ముహూర్తాన ఆ ట్వీట్ చేశాడో కానీ.. నెటిజన్లకు మాత్రం అడ్డంగా బుక్కయ్యాడు. ఎలా అంటారా? కింద చూడండి.. నెటిజన్ల రెస్పాన్స్…

1) ఆ చంద్రుడే నాకు వెన్నుపోటు పొడిచాడు అని కూడా అన్న గారు చెప్పారు...

2)మొన్న నే గా పౌర్ణమి వెళ్లిపోయింది., ఇంక వచ్చేది అమావస్యే !! అంటే అన్నగారు కూడా symbolic గా మీకు తిరోగమనం స్టార్ట్ అయింది అని మీకు చెబుతున్నట్టు వుంది.
అయ్యా పోస్ట్ పెట్టే ముందు చూస్కోవాలి కదా??
Untitled Document
Advertisements