జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా

     Written by : smtv Desk | Sun, Sep 30, 2018, 12:42 PM

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ముత్తంశెట్టి కృష్ణారావును నియమిస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం నిర్ణయం తీసుకున్నారు. విజయవాడకు చెందిన కృష్ణారావు ప్రస్తుతం జనసేన కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వయకర్తగా ఉన్నారు. తాజా నియామకంతో పార్టీ అధినేత ఆయనకు పెద్దపనే అప్పగించినట్లయింది. తన నియామకంపై కృష్ణారావు స్పందిస్తూ అధినేత ఆలోచనలకు అనుగుణంగా క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.విజయవాడలోని కృష్ణారావు నివాసాన్నే జనసేన కార్యాలయంగా వినియోగించుకుంటోంది. ఏలూరులో పవన్‌ను కలసిన కృష్ణారావు ధన్యవాదాలు తెలిపారు

Untitled Document
Advertisements