తెలంగాణ ఎన్నికలపై కీలక ప్రకటన

     Written by : smtv Desk | Sun, Sep 30, 2018, 02:37 PM

తెలంగాణ ఎన్నికలపై కీలక  ప్రకటన

తెలంగాణలో నవంబరులోనే ఎన్నికలు జరుగతాయని కొన్ని రోజులుగా విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పార్టీలు అభ్యర్థులను ప్రకటించి, ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాయి. చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటే ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థలు సైతం ఇదే కథనాలను ప్రచురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. తెలంగాణ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో కలిపి తెలంగాణ ఎన్నికలు జరిపించనున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని ఆయన వెల్లడించారు. ఎన్నికల గురించి మీడియాలో వార్తలు రాసేముందు సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకోవాలని, ఆ తరువాతనే ఏ వార్తనైనా ప్రచురించాలని ఆయన సూచించారు.

Untitled Document
Advertisements