టీటీడీలో లైంగిక వేధింపులు...

     Written by : smtv Desk | Sun, Sep 30, 2018, 03:29 PM

టీటీడీలో లైంగిక వేధింపులు...

టీటీడీలో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపుతోంది.తిరుమల తిరుపతి దేవస్థానంలోని పురుష అధికారులు, తమను నిత్యమూ లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ, వందలాది మంది మహిళా ఉద్యోగులు రోడ్డెక్కారు. విష్ణునివాసంలో పనిచేస్తున్న అధికారులు కొందరు, అధికార పార్టీ అండతో తమను వేధిస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు.

విధులకు హాజరవుతున్న తమను, పడగ్గదుల్లోకి రావాలని అడుగుతున్నారని, తాము కాదంటే, సరిగ్గా పని చేయడం లేదంటూ విరుచుకుపడుతున్నారని పలువురు మహిళలు ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు, వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మహిళలు తమ ఆందోళన విరమించారు.

గతం లో తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం ఆలయ ఏఈవో శ్రీనివాసులుపై ఓ మహిళ ఆరోపణలు చేసింది. తన కుమార్తెను ఏఈవో శ్రీనివాసులు వేధిస్తున్నారంటూ ఆమె ఆరోపించడం కలకలం రేపుతోంది. శ్రీనివాస మంగాపురం ఆలయ ఏఈవో శ్రీనివాసులు.. తనతోపాటు పనిచేసే ఓ మహిళా ఉద్యోగి కుమార్తెకు పదే పదే ఫోన్లు చేసి వేధిస్తున్నారు. దీంతో బాధితురాలు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొన్ని రోజులుగా ఫోన్లు చేసి, మెసేజ్‌లు పంపి లైంగిక వాంఛ తీర్చాలని వేధించాడు. అయితే, చివరకు వేధింపులు ఎక్కువయ్యేసరికి బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

Untitled Document
Advertisements