పెళ్లి రోజే నరకం..

     Written by : smtv Desk | Sun, Sep 30, 2018, 04:03 PM

పెళ్లి రోజే నరకం..

పెళ్లి చేసుకొని ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన అమ్మాయికి తొలిరోజే నరకం చూపించారు అత్తింటివారు. పెళ్లి జరిగినరోజే భర్తతో పాటు అతని బంధువులు, మరో నలుగురు తాంత్రికులు నవవధువుపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన హర్యాణాలో చోటు చేసుకుంది.

కురుక్షేత్రలోని బాబెయిన్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతికి సెప్టెంబర్ 12వ తేదీ రాత్రి వివాహం జరిగింది. 13వ తేదీని నవదంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. నవవధువుకు ఆమె భర్త పాలలో మత్తుమందు కలిపి తాగించాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. యువతి స్ప‌ృహ కోల్పోయిన వెంటనే భర్తతో పాటు అతని సోదరుడు, బావ, మరో నలుగురు తాంత్రికలు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

Untitled Document
Advertisements