ఫేస్ బుక్ వినియోగదారులకు కీలక సూచనలు

     Written by : smtv Desk | Sun, Sep 30, 2018, 06:34 PM

ఫేస్ బుక్ వినియోగదారులకు కీలక సూచనలు

ఫేస్‌బుక్‌ యూజర్లు వెంటనే తమ ఖాతాలను లాగ్‌ అవుట్‌ చేసి మళ్లీ రీ-లాగిన్‌ అవడం మంచిదని సైబర్‌, ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు 5కోట్ల ఖాతాలను యాక్సెస్‌ టోకెన్స్‌ను హ్యాకర్లు చోరీ చేసిన నేపథ్యంలో నిపుణులు ఈ సూచన చేస్తున్నారు. వీరి సూచనల ప్రకారం 'మొబైల్స్‌, ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌ ఇలా ఎందులో అయితే ఫేస్‌బుక్‌ లాగిన్‌ అయిన దాదాపు 2.3బిలియన్ల యూజర్లు ఇప్పుడు వాటిని లాగ్‌ అవుట్‌ చేసుకొని మళ్లీ రీలాగిన్‌ అవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల మన ఖాతా భద్రత, గోప్యత సెట్టింగ్స్‌ను సమీక్షించుకున్నట్లు అవుతుందని ని సైబర్‌ నిపుణులు చెప్తున్నారు.

దీని వల్ల ఖాతాలకు మరింత భద్రత ఏర్పడుతుందని పేర్కొంది. రీ లాగిన్ అయిన తరువాత, కుడివైపు పైన కనిపించే సెట్టింగ్స్ లోకి వెళ్లి, 'సెక్యూరిటీ అండ్ లాగిన్' ఆప్షన్ ఎంచుకోవాలని తెలిపింది. ఈ విభాగంలో 'చేంజ్ పాస్ వర్డ్', 'లాగిన్ విత్ యువర్ ప్రొఫైల్ పిక్చర్' అనే ఆప్షన్లు కనిపిస్తాయని తెలిపింది. వీటి కింద 'టూ ఫాక్టర్ ఆథెంటికేషన్' అన్న ఆప్షన్ ను జోడించామని, దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఎకౌంట్ ను మరింత భద్రంగా ఉంచుకోవచ్చని పేర్కొంది.

ఇందులో టెక్ట్స్ మెసేజ్ ఆప్షన్ ఎంచుకుంటే, రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఆరు అంకెల కోడ్ ను పంపిస్తామని, లాగిన్ కావడానికి దాన్ని ఎంటర్ చేయాల్సి వుంటుందని ఫేస్ బుక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో గూగుల్ ఆథెంటికేటర్ ద్వారా కూడా లాగిన్ కావచ్చని వెల్లడించింది. గూగుల్ ద్వారా అయితే, కంప్యూటర్ స్క్రీన్ పై కనిపించే క్యూఆర్ కోడ్ ను రిజిస్టర్డ్ మొబైల్ నుంచి స్కాన్ చేయాల్సి వుంటుందని తెలిపింది.

Untitled Document
Advertisements