ఆయన వల్లే ఇదంతా

     Written by : smtv Desk | Tue, Oct 02, 2018, 12:44 PM

ఆయన  వల్లే ఇదంతా

హైదరాబాద్ , అక్టోబర్ 02: తాను బిగ్‌బాస్ షోలో పాల్గొనడం వెనుక ప్రిన్స్ మహేశ్ బాబు ప్రోత్సాహం వుందని బిగ్‌బాస్2 విజేత కౌశల్ అన్నాడు.

తన లైఫ్‌లో బిగ్‌బాస్‌కి ముందు-బిగ్‌బాస్ తర్వాత అని చెప్పుకునేలా చేసిన ఆ షోకి లైఫంతా ధన్యవాదాలు చెబుతానని కౌశల్ పేర్కొన్నాడు. మహేశ్ బాబు తొలి చిత్రం ‘రాజకుమారుడు’తోనే తమ మధ్య సాన్నిహిత్యం ఉందని కౌశల్ అన్నాడు.

హైదరాబాద్‌లో తొలిసారి మోడలింగ్ అకాడమీ ఏర్పాటు చేసిన తనకు మహేశ్ చాలా సహాయం చేశారని పేర్కొన్నాడు. "రాజకుమారుడు సినిమా సమయంలో దగ్గురుండి మోడలింగ్ అకాడమీని ఏర్పాటు చేయించారు మహేశ్. అది లేకపోతే నేనెప్పుడో వైజాగ్ తిరిగి వెళ్లిపోయేవాణ్ణి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా నాకెంతో సాయం చేశారు. నా గెలుపుకు కృషి చేసిన కౌశల్ ఆర్మీకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే" అని తెలిపాడు. బిగ్‌బాస్ తర్వత కౌశల్‌కు సినిమా అవకాశాలు వరుసపెట్టి వస్తున్నాయని తెలుస్తోంది. మంచి కథతో ఏ దర్శకుడు వచ్చినా హీరోగా చేస్తానని ఇదివరకే కౌశల్ తెలిపాడు .

Untitled Document
Advertisements