ప్రభుత్వ ఉద్యోగులు మంత్రిపై ప్రశంసలు

     Written by : smtv Desk | Tue, Oct 02, 2018, 05:54 PM

ప్రభుత్వ ఉద్యోగులు మంత్రిపై ప్రశంసలు

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేస్తారు. మిగతా రెండు రోజులు కంపెనీలు సెలవులు ఇస్తుంటాయి. దీంతో వారు మానసికంగా దృఢంగా పని చేయడానికి సిద్ధంగా ఉంటారు.అందువల్ల ఉద్యోగుల్లో పని సామర్థ్యం పెరుగుతోంది. అదే విధానాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయాలని కర్ణాటక సాంఘిక సంక్షేమ మంత్రి ప్రియాంక్ ఖర్గే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖ రాశారు.

లేఖలో…‘ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదురోజుల పనిదినాలను అమలు చేస్తే బావుంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పని సామర్థ్యం పెంపుకు ఇది మరింత దోహదపడగలదు’ అని ఖర్గే పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కూడా పెద్ద ఎత్తున విన్నపాలు వస్తున్నాయని చెప్పారు. ఈ లేఖను ఆగస్టు 29న సీఎంకు రాశారు. కానీ నిన్న మధ్యాహ్నమే వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు మంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Untitled Document
Advertisements