గాంధీ జయంతిన మాంసమా !!

     Written by : smtv Desk | Tue, Oct 02, 2018, 06:24 PM

గాంధీ జయంతిన  మాంసమా !!

అక్టోబర్ 02: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజు మద్యం, మాంసం ముట్టుకోవద్దని నిబంధనలు వున్నాయి. గాంధీ జయంతిని శాకాహార దినంగా భావించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. చాలామంది. ఈ ఒక్కరోజు జీవహింసకు, మద్యానికి దూరంగా వుంటున్నారు. కానీ చెప్పినోళ్ళే నిబంధనలను ఉల్లంఘిస్తేనే అసలు సమస్య మొదలౌతుంది. ఒట్టు తీసి గట్టున పెట్టిన చందంగా రైల్వేశాఖ తన నిర్ణయాన్ని మార్చుకుంది.

అక్టోబరు 2న రైళ్లలో యథావిధిగా మాంసాహారం లభిస్తుందని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో ఒక్కసారిగా జనాలు ఆశ్చర్యపోక తప్పలేదు. ఈ ఏడాది మేలో రైల్వే స్టేషన్‌లలో ఎలాంటి మాంసాహారాలు విక్రయించవద్దని సర్క్యులర్ జారీచేసి, ఇప్పుడిలా మాటమార్చడం ఏంటనే ప్రశ్నలు తలెత్తాయి. 2018 నుంచి 2020 వరకు ఈ నిబంధన కొనసాగాలని అన్న రైల్వే, ఇలా అర్ధంతరంగా నిర్ణయం మార్చుకోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు సమాధానంగా ప్రజాభీష్టం మేరకు దాన్ని రద్దు చేశామని రైల్వే అధికారులు తమనితాము సమర్థించుకుంటున్నారు.

ఈ మేరకు క్యాటరింగ్‌ విభాగానికి రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులందరికీ మాంసాహార భోజనం కూడా అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ఆన్‌లైన్ క్యాటరింగ్ సర్వీస్ స్విగ్గీ కూడా వ్యాపారమే పరమావధిగా గాంధీజయంతి నాడు కూడా మాంసాహారాన్ని పార్శిల్ చేస్తోంది. హింసను విడనాడాలి అన్న గాంధీగారికి ఈ ఒక్కరోజు కూడా విలువ ఇవ్వకపోతే ఎందుకని అంటున్నారు ప్రజలు. ప్రభుత్వాలు, కొన్ని ప్రైవేట్ సంస్థలు వ్యాపారమే పరమావధిగా సాగితే ఎలా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వీటి మీద నియంత్రణ చాలా ముఖ్యమని అంటున్నారు.

Untitled Document
Advertisements