5 మిలియన్ల వ్యూస్: 'అరవింద సమేత'

     Written by : smtv Desk | Wed, Oct 03, 2018, 10:57 AM

5 మిలియన్ల వ్యూస్: 'అరవింద సమేత'

ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన 'అరవింద సమేత' ట్రైలర్ నిన్న సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకునే విధంగా మంచి మెసేజ్ ఉన్న డైలాగులతో సాగిన ఈ ట్రైలర్ అభిమానులకు బాగా కనెక్టయింది.

ఈ వేడుకలో కల్యాణ్ రామ్, దర్శకుడు త్రివిక్రమ్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత రాధాకృష్ణ, నటీనటులు జగపతిబాబు, సితార, సునీల్, పాటల రచయితలు సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, సంగీత దర్శకుడు తమన్ తదితరులు పాల్గొన్నారు.అందుకే కేవలం 12 గంటల్లో రికార్డ్ స్థాయిలో 5 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న మొదటి సినిమా కావడం, ఎప్పుడూ లేనంతగా త్రివిక్రమ్ ఫ్యాక్షన్ నేపథ్యాన్ని సినిమాలో వాడుకోవడంతో ప్రేక్షకులు, అభిమానుల్లో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

Untitled Document
Advertisements