చైతన్య రథంతో బాలకృష్ణ!

     Written by : smtv Desk | Wed, Oct 03, 2018, 01:12 PM

 చైతన్య రథంతో  బాలకృష్ణ!

శ్రీకాకుళం, అక్టోబర్ 03: నందమూరి బాలకష్ణ ప్రతిష్టాత్మకంగా క్రిష్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఎన్టీఆర్‌ బయోపిక్‌ చిత్రం తదుపరి షెడ్యూల్‌ను ఈ వారంలో ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్‌ చైతన్య రథంపై తన చారిత్రాత్మక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన శ్రీకాకుళంలోనే చిత్రీకరణ చేయనున్నారు. తన తండ్రి హరికష్ణ పాత్రలో నటిస్తున్న 'నందమూరి కళ్యాణ్‌ రామ్‌' కూడా శ్రీకాకుళంలో జరిగే షూటింగ్‌లో పాల్గొననున్నాడు. కళ్యాణ్‌ రామ్‌ ఈ చిత్రం కోసం 20 రోజులపాటు డేట్స్‌ని కేటాయించారు. అయితే ఇటీవలే హరికష్ణగారు హఠాన్మరణం తర్వాత, ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఆయన పాత్రను ఇంకా పెంచాలనీ, సీనియర్‌ ఎన్టీఆర్‌ కోసం, పార్టీ కోసం, ఆయన చేసిన సేవలను ఈ చిత్రంలో మరింతగా చూపించనున్నారని తెలుస్తోంది. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Untitled Document
Advertisements