ద్వేశించే వారిని కూడా దూషించకండి :విజయ్ దేవరకొండ

     Written by : smtv Desk | Wed, Oct 03, 2018, 03:27 PM

ద్వేశించే వారిని కూడా దూషించకండి :విజయ్ దేవరకొండ

హైదరాబాద్ ,అక్టోబర్ 03: విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘నోటా’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో విజయ్ తన అభిమానులైన రౌడీస్‌కు ఓ సందేశాన్ని ఇచ్చాడు. తన ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘ప్రియమైన రౌడీస్‌ సినిమా, జీవితం, రౌడీ కల్చర్‌, యాటిట్యూడ్‌లతో మనం మనలా ఉండేందుకు మనం ఓ మార్పు తీసుకువస్తున్నాం. సంఖ్యాపరంగా మనం పెరుగుతున్నాం. అదే సమయంలో మనం సోషల్ మీడియా పరంగా కూడా కొత్త ట్రెండ్ తీసుకురావాలి. మీలో చాలామంది ప్రేమతో నా ఫొటోను డీపీగా పెట్టుకుంటున్నారు.

అయితే దీని కారణంగా మీరు కొంత మందితో వాదనలకు దిగుతున్నారు.నేను అలాంటివి చేయను అందుకే మీరు కూడా చేయొద్దు. నేను సాధించిన విజయాలు నా స్వశక్తితోనే సాధించాను. అందుకే ఇతరుల గురించి నేను పట్టించుకోను. అందుకే మిమ్మల్ని ద్వేశించే వారు కూడా ఆనందంగా ఉండాలని కోరుకోం‍డి. నేను మీకు ఎప్పటికీ మంచి సినిమాలు, మంచి దుస్తులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. ఆన్‌లైన్‌ వివాదాలు చూడటం నాకు ఇష్టంలేదు’ అంటూ విజయ్ రౌడీస్‌కు ట్వీట్ చేశాడు.Untitled Document
Advertisements