పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు !!

     Written by : smtv Desk | Wed, Oct 03, 2018, 03:50 PM

పిటిషన్‌ను కొట్టివేసిన  హైకోర్టు !!

అక్టోబర్ 03: సుప్రీంకోర్టు మరో కీలక తీర్పునిచ్చింది. ఉమ్మడి హైకోర్టులో తెలుగు రాష్ట్రాల న్యాయాధికారుల విభజనపై బుధవారం తీర్పు వెలువరించింది. ఉద్యోగాల్లో స్థానికత ఆధారంగా విభజించాలని తెలంగాణ న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టు మార్గదర్శకాల రోస్టర్ విధానంలోనే నియామకాలు చేపట్టాలని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం ఆదేశించింది.

హైకోర్టులో జడ్జీలుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చాలామంది ఉన్నారని, విభజనలో స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వాలని 2015లో తెలంగాణ న్యాయాధికారుల సంఘం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుంటే తెలంగాణ న్యాయాధికారులకు అన్యాయం జరుగుతుందని, అందరికీ సమాన అవకాశాలు కల్పించే 371(డి)ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

దీనికి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం లాయర్లు స్పందిస్తూ.. 371(డి) న్యాయ శాఖకు వర్తించదనీ, ఈ పోస్టులకు దేశంలోని ఎక్కడివారైనా పోటీ పడొచ్చని తేల్చి చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. తెలంగాణ న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం, రోస్టర్ విధానంలోనే జడ్జీల నియామకాలు చేపట్టాలని ఆదేశించింది.





Untitled Document
Advertisements