దేశంలోని ప్రతి ఒక్కరు నన్ను క్షమించాలి: అందాల తార

     Written by : smtv Desk | Wed, Oct 03, 2018, 04:36 PM

దేశంలోని ప్రతి ఒక్కరు నన్ను క్షమించాలి: అందాల తార

చైనా ,అక్టోబర్ 03: పన్నులు ఎగ్గొట్టడం సెలబ్రిటీలకు అలవాటుగా మారింది. కానీ ప్రభుత్వాలు వాటి పని అవి చేయాలి కదా. భాగా పన్ను ఎగ్గొట్టిన ఓ అందాలరాశికి చైనా ప్రభుత్వం దిమ్మతిరిగే షాకిచ్చింది. పన్నుల ఎగవేత, బకాయిలు కింద రూ. 945 కోట్ల రూపాయల భారీ జరిమానా విధించింది. అంతేకాదు ఇప్పటికే ఆమె ప్రతినిధిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

చైనా టాప్ హీరోయిన్ ఫ్యాన్ బింగ్ బింగ్(37) నటిగా, మోడల్‌గా, సింగర్‌గా చాలా పాపులర్. ఎక్స్‌ మ్యాన్‌, ఐరన్‌మ్యాన్‌, యాష్‌ ఈజ్‌ పూరెస్ట్‌ వైట్‌ వంటి సినిమాల్లో ఫ్యాన్ అందరి నుంచి ప్రశంసలందుకున్నారు. అయితే అందం వెనుక నేరం కూడా దాక్కుని ఉంది. ఫ్యాన్ కంపెనీలు పెద్ద ఎత్తున పన్నులను ఎగ్గొట్టినట్లు స్టేట్ అడ్మినిస్ట్రేషన్ టాక్సేషన్ ఆరోపించింది. దీంతో 129 మిలియన్ డాలర్లు( రూ.945 కోట్లు) జరిమానా చెల్లించాలని ఐటీ శాఖ ఆదేశించింది. లేకపోతే క్రమినల్ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న ఆమె చిత్రం ‘ఎయిర్ స్ట్రైక్’ లో పాత్ర చెల్లింపులపై 7.3 మిలియన్ యువాన్(1.1 మిలియన్ డాలర్లు) పన్నులు తప్పించుకునేందుకు ఆహె కాంట్రాక్టులను చీల్చిందనే ఆరోపణలు ఉన్నాయి. చైనీస్ అధికారిక వార్తా సంస్థ జిన్హుహ ఈ నోటీసులను అధికారికంగా బుధవారం విడుదల చేసింది. కాగా దీనిపై ఫ్యాన్ స్పందిస్తూ.. ‘ నా ప్రవర్తన మార్చుకుంటాను. చట్టాల దుర్వినయోగంపై సిగ్గుపడుతున్నాను. చట్టాన్ని గౌరవిస్తాను. దేశంలోని ప్రతి ఒక్కరు నన్ను క్షమించాలి’ అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది.






Untitled Document
Advertisements