8న ఓటర్ల తుది జాబితా విడుదల...

     Written by : smtv Desk | Sat, Oct 06, 2018, 04:02 PM

8న ఓటర్ల తుది జాబితా విడుదల...

దిల్లీ,అక్టోబర్ 06 : ప్రభుత్వ కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు మీడియాతో సమావేశాన్ని నిర్వహించనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు అర్దమవుతుంది . మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం‌ల వీటి తోపాటు తెలంగాణ ఎన్నికల తేదీలను కూడా విడుదల చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అని సమాచారం .

అన్ని రాష్ట్రల ఎన్నికల నాయకులతో రెండు రోజులుగ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమావేశం జరుపుతున్నారు . ఇరోజు తెలంగాణకు సీఈసీ సాంకేతిక నిపుణులు వస్తున్నారని సమాచారం . తెలంగాణలో ఓటర్ల జాబితా రూపొందించేచర్చలో సాంకేతిక ఆరోపణలను పరిశీలించనున్నారు. ఈ నెల 8న ఓటర్ల తుది జాబితా విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. అయితే ప్రస్తుతం సాంకేతిక సమస్యలు వస్తున్నందున ఈ అంశంపై నిన్నటి సమావేశంలో చర్చించి సాంకేతిక నిపుణులను సీఈసీ పంపిస్తోంది
అని తెలియనున్నది .

Untitled Document
Advertisements