ఆనందంలో కెసిఆర్

     Written by : smtv Desk | Sat, Oct 06, 2018, 04:08 PM

ఆనందంలో కెసిఆర్

హైదరాబాద్ ,అక్టోబర్ 06: అసెంబ్లీ ఎన్నికల కోసం వెయ్యి కళ్లతో చూస్తున్న టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నికల సంఘం శుభవార్త తెలియచేసారు . కొన్ని నియమాలతో రైతు బంధు పథకం చెక్కులను ఇవ్వడానికి అనుమతిచ్చింది. గతంలో నమోదైన రైతన్నలకే వీటిని పంపిణీ చేయాలని, పథకంలో కొత్తగా ఎవరినీ పెట్టకూడదని , నగదు పంచకూడదని స్పష్టం చేసింది.

మరోవైపు ,పంపిణీలో రాజకీయ నాయకులు జోక్యంచేసుకోకూడదని వెల్లడించింది . మొట్ట మొదటిసారిగ రైతుబంధు చెక్ తీసుకోబోతున్న రైతులకు మాత్రమే రెండో రౌండ్ చెక్కుల పంపిణీనికి బ్యాంకు ఖాతాలో జమ చేయాలంది. వ్యవసాయ అధికారుల ద్వారా స్వయాన రైతులకు పంపిణీ చేయకూడదని హెచ్చరించింది. దీనిపై రైతులు హర్షం వ్యక్తపరుస్తున్నారు .

ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి రైతుబంధు చెక్కుల పంపిణీ ప్రభావం చూపించే అవకాశముందని విపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం తెలిసినదే. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం పేరుతో ఎకరాకు రూ.4వేలు చొప్పున సంవత్సరానికి రూ.8 వేలు ఇస్తున్న విషయం తెలిసినదే . తొలి సారి రూ.4వేలు ఇవ్వగా రెండోదఫా రూ.4వేలు రానుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కనుక బతుకమ్మ పండగ కోసం చీరలు పంపిణి చెయ్యరాదని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే.

Untitled Document
Advertisements