రాష్ట్ర ముఖచిత్రమ్ మారిపోతుంది :మంత్రి హరీష్

     Written by : smtv Desk | Sat, Oct 06, 2018, 04:57 PM

రాష్ట్ర ముఖచిత్రమ్ మారిపోతుంది :మంత్రి హరీష్

హైదరాబాద్ ,అక్టోబర్ 06: ‘అభివృద్ధిలో సిద్ధిపేట, సిరిసిల్లలు పోటీ పడుతున్నాయి.. సీఎం కేసీఆర్ ప్రారంభించిన అభివృద్ధి యజ్ఞాన్ని నేనూ, కేటీఆర్ కొనసాగిస్తున్నాం…రాష్ట్ర ముఖచిత్రం మారిపోతోంది.. ’ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్‌ బేగంపేటలోని కేటీఆర్ నివాసంలో ఈ రోజు జరిగిన సిరిసిల్ల నియోజకవర్గ కీలక కార్యకర్తల సమావేశంలో హరీష్ ప్రసంగించారు .

‘అభివృద్ధి పథంలో సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలు పోటీపడి ముందుకు పోతున్నాయి. కేసీఆర్ ప్రారంభించిన అభివృద్ధి యజ్ఞాన్ని సిద్దిపేటలో నేను కొనసాగిస్తున్నాను. సిద్దిపేట అభివృద్ధి వెనుక 30 ఏళ్ల శ్రమ ఉంది. అయితే కేటీఆర్.. సిద్దిపేటలో గత 30 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని తన నియోజకవర్గమైన సిరిసిల్లలో గత నాలుగేళ్లలోనే చేసి చూపించారు..ఆత్మహత్యలకు పేరొందిన సిరిసిల్ల ఇప్పుడు సిరుల ఖిల్లాగా మారిందంటే అదంతా కేటీఆర్ ఘనతే’ అని కొనియాడారు.

Untitled Document
Advertisements