దేవుడికి అనుష్క కృతఙ్ఞతలు

     Written by : smtv Desk | Mon, Nov 05, 2018, 03:20 PM

దేవుడికి అనుష్క కృతఙ్ఞతలు

ఈరోజు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 30వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ విరాట్‌కు శుభకాంక్షలు తెలుపుతూ అతనితో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు. ‘అతన్ని పుట్టించినందుకు ధన్యవాదాలు దేవుడా’ అని అనుష్క ట్వీట్‌ చేశారు. పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం సాయంత్రం విరాట్‌, అనుష్క కలిసి విహారయాత్రకు బయలుదేరారు. గతంలో అనుష్క బర్త్‌డేను పురస్కరించుకుని విరాట్‌ రకరకాల కేక్స్ ‌తెప్పించి ఘనంగా తన భార్య పుట్టినరోజు వేడుకలను జరిపారు. ఇప్పుడు అనుష్క కూడా తన భర్త కోసం సర్‌ప్రైజ్‌ పార్టీని ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది.

ఇక వర్క్‌ విషయానికొస్తే..ఇటీవలే కోహ్లీ సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేసి, అత్యంత వేగంగా 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాట్స్‌మన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. విశాఖ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో వన్డేలో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. తాజాగా వెస్టిండిస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. మరోపక్క అనుష్క ‘జీరో’ సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఇందులో అనుష్క షారుక్‌కు జోడీగా నటించారు. ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌ మరో హీరోయిన్‌గా నటించారు. డిసెంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Untitled Document
Advertisements