ఎన్టీఆర్ , రామ్ చరణ్ అభిమానులకి శుభవార్త

     Written by : smtv Desk | Mon, Nov 05, 2018, 04:48 PM

టాలీవుడ్‌ దర్శకధీరుడు ‘రాజమౌళి’ యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌లతో మల్టిస్టారర్‌ అనౌన్స్‌ చేసినప్పటినుంచీ ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటేశాయి. ‘RRR’ అంటూ వర్కింగ్‌ టైటిల్‌ను అనౌన్స్‌ చేసిన చిత్రయూనిట్‌ మళ్లీ ఇంతవరకు మళ్లీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ప్రస్తుతం చిత్రబృందం చేసిన ప్రకటనతో అభిమానుల్లో సందడి మొదలైంది. నవంబర్‌ 11 ఉదయం 11 గంటలకు RRR మూవీ ఓపెనింగ్‌ సెరమెనీ అంటూ మేకర్స్‌ ప్రకటించారు. ఇక నందమూరి, మెగా అభిమానులకు పండుగే పండుగ. ఈ మూవీపై ముందుగా వినిపించిన ఊహాగానాలే నిజమయ్యాయి.

నవంబర్‌లో షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జోరుగా సాగగా.. తాజాగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించేసరికి అభిమానుల్లో సందడి నెలకొంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని, అందులో ఒక విదేశీ భామను తీసుకోబోతున్నారని, ఇంకా ఈ సినిమా కథ ఇదేనంటూ అనేక రూమర్స్‌ వినిపించాయి. అయితే వీటన్నంటికి జక్కన్న నవంబర్‌ 11న చెక్‌పెట్టనున్నాడు.





Untitled Document
Advertisements