బీజేపీపై మండిపడ్డ పవన్

     Written by : smtv Desk | Mon, Nov 05, 2018, 05:46 PM

 బీజేపీపై మండిపడ్డ పవన్

తూ.గో.జి, నవంబర్ 5: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్రలో భాగంగా ఆదివారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట బహిరంగ సభలో మాట్లాడుతూ బెజేపి పై మండిపడ్డారు. 'ఉత్తరప్రదేశ్‌ను నాలుగు ముక్కలు చేసే వరకు తన కడుపు మంట చల్లారదని, బీజేపీపై నాకు చెప్పలేనంత కోపం ఉంది.

1997లో కాకినాడలో వొక ఓటు.. రెండు రాష్ట్రాలు అన్నప్పుడు నాయకులకు బుద్ధి ఉండొద్దా? మీరెవర్రా రాష్ట్రాన్ని విడదీయడానికి అని అడగొద్దా? ఏపీ రాజకీయ నేతల్లో ఒక్కరికీ ధైర్యం లేదు అని విరుచుకుపడ్డారు. ఉత్తర ప్రదేశ్‌ను కూడా అలాగే చీల్చుకుంటారా?’ అని నిలదీశారు. ఆ రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేసేవరకు తమ కడుపు మంట చల్లారదని ఆవేశంతో ఊగిపోయారు పవన్.

Untitled Document
Advertisements