కోదండరామ్ కు 'అగ్గిపెట్ట' గుర్తు

     Written by : smtv Desk | Mon, Nov 05, 2018, 06:03 PM

కోదండరామ్ కు 'అగ్గిపెట్ట' గుర్తు

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్ ఈ రోజు ఉదయం నగరంలోని తమ పార్టీ కార్యాలయంలో ఎన్నికల సంఘం కేటాయించిన 'అగ్గిపెట్ట' గుర్తున్న పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ “మా పార్టీ ఎన్నికల గుర్తు అగ్గిపెట్టె. మా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఎన్నికల సంఘానికి పంపించి ఆమోదం పొందగానే దానినీ ప్రకటిస్తాము. మహాకూటమిలో సీట్ల పంపకాలపై చర్చలు తుది దశకు చేరుకొన్నాయి. దీపావళి నాటికి మేము పోటీచేయబోయే స్థానాలపై స్పష్టత రావచ్చు.

త్వరలోనే మా అభ్యర్ధుల పేర్లు ప్రకటిస్తాము. అధికారం దక్కించుకోవడం కోసం మేము మహాకూటమి ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలో కొనసాగుతున్న తెరాస నిరంకుశపాలనకు ముగింపు పలికి, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతోనే మహాకూటమిని ఏర్పాటు చేశాము. కనుక ఈ ఎన్నికలు ప్రజల ఆకాంక్షాలకు, నిరంకుశత్వ పాలనకు మద్య సాగుతున్న ఎన్నికలుగా భావించాలి,” అంటూ చెప్పుకొచ్చాడు.

Untitled Document
Advertisements