మైమరపించే గొంతు ఈమె సొంతం

     Written by : smtv Desk | Tue, Nov 06, 2018, 05:23 PM

మైమరపించే గొంతు ఈమె సొంతం

తూ.గో.జి, నవంబర్ 6 : రంగంపేట మండలం వడిశలేరు గ్రామానికి చెందిన వొక మహిళ రోజూ కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకోస్తోంది. తన పేరు పసల బేబి. ఈమె అస్సలు చదువుకోలేదు. సినిమా పాటలు కూడా పెద్దగ తెలీదు. కానీ ఆమె పనికి వెళ్ళినప్పుడు అక్కడ పని చేస్తూ ఈమెకు వొచ్చిన ఏదో వొక పాట పాడుతూ అందరిని తన గొంతుతో మైమరపించేది. ఆమెపాట విన్నవారంతా నీ గొంతు వింటుంటే ఎంత బాగుంటుందో. నువ్వు పాటలు నేర్చుకుని పాడొచ్చు కదా. అనేవారు. దాంతో ఆమె పాటలు విని నేర్చుకుని పాడటం మొదలుపెట్టింది. ఆమె గళం నుంచి వచ్చే శ్రావ్యమైన పాటల సడికి ఇరుగుపొరుగు చిన్న చిన్న వేడుకల్లో పాడటానికి ఆహ్వానించడం మొదలుపెట్టారు. ఎదుటివాళ్లు పాడుతుంటే విని గుర్తుపెట్టుకునే అపారమైన గ్రాహకశక్తి ఆమె సొంతం. అయితే ఈ మధ్య వొకరోజు బేబి అనుకోకుండా పక్కింటి రాణి ఇంటికి వెళ్లినప్పుడు ఆమె ప్రేమికుడు చిత్రంలో ఓ చెలియా నా ప్రియసఖియా.. పాట పాడుతోంది. బేబీకి ఆమె పాడిన విధానం నచ్చలేదు. పాటని కూనీ చేయకు రాణి.. అని ఆ పాట నేనే పాడాను. అప్పుడు రాణి వీడియో తీసింది. అందరూ ఫోన్‌చేసి చాలా బాగా పాడావు అని మెచ్చుకుంటుంటే వాళ్లందరికీ ఎలా తెలిసిందో అర్థం కాలేదు.



పైగా పత్రికలకు ఇంటర్వ్యూ ఇవ్వమని అడుగుతుంటే తెలిసింది నా పాటని రాణి ఫేస్‌బుక్‌లో పెట్టడం వల్ల ఏడు లక్షల మందికిపైనే చూశారట. నిజంగా నాకు సోషల్‌ మీడియా అంటేనే తెలియదు. ఇప్పుడు దాని ద్వారా దేశం మొత్తం నేను తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అంటోంది బేబి.





Untitled Document
Advertisements