ఎన్టీఆర్ బయోపిక్.. సావిత్రి ఫస్ట్ లుక్

     Written by : smtv Desk | Tue, Nov 06, 2018, 07:29 PM

ఎన్టీఆర్ బయోపిక్.. సావిత్రి ఫస్ట్ లుక్

నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మీద పోస్టర్ తోనే అంచనాలను పెంచేస్తున్నారు. లేటెస్ట్ గా దీవాళి కానుకగా లేచింది మహిళా లోకం అంటూ బుల్లోడు బుల్లెమ్మతో వచ్చాడు. సినిమాలో సావిత్రి పాత్రలో నిత్యా మీనన్ నటిస్తుంది. ఆల్రెడీ కీర్తి సురేష్ మహానటితో సావిత్రి పాత్రలో ఆమె తప్ప ఇంకెవరు అలా చేయలేరన్నట్టు ప్రూవ్ చేసింది.

ఈరోజు రిలీజ్ అయిన గుండమ్మ కథ పోస్టర్ లో మాత్రం సావిత్రిగా నిత్యా మీనన్ కూడా పర్ఫెక్ట్ అనిపించేసింది. ఇక ఆమె నటన ఎలా ఉంటుందో చూడాలి. ఎన్.టి.ఆర్ సినిమా మొదట ఒక సినిమాగా అనుకున్నా ఇప్పుడు రెండు పార్టులుగా రిలీజ్ అవుతుంది. ఎన్.టి.ఆర్ కథానాయకుడిగా ఒక పార్ట్, ఎన్.టి.ఆర్ మహానాయకుడిగా రెండో పార్టు రిలీజ్ అవుతుంది. ఇక ఈరోజు గుండమ్మ కథలోని ఎన్.టి.ఆర్, సావిత్రి గెటప్పులతో బాలయ్య, నిత్యా అచ్చు గుద్ది నట్టు అలానే ఉన్నారు.

Untitled Document
Advertisements