అందాలను ఆరబోస్తున్న హీరోయిన్...!

     Written by : smtv Desk | Tue, Nov 06, 2018, 07:44 PM

అందాలను ఆరబోస్తున్న హీరోయిన్...!

సామాజిక మాధ్యమాల్లో అందాలను విచ్చలవిడిగా ఆరబోయే నటి దిశా పటాని సమయ సందర్భం లేకుండా మరోసారి రచ్చేసింది. నెటిజన్ల చేతిలో చివాట్లు తింటోంది. దేశమంతా దీపావళి మూడ్‌లోకి వెళ్ళిపోయింది కదా.. పండగను పురస్కరించుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. సెలెబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అలాగే దిశా పటాని కూడ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ తన అధికారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక ఫోటో పెట్టింది. ఆ ఫొటోలో ఒక దీపం పట్టుకొని కనిపిస్తోంది దిశా. అయితే పైన అచ్ఛాదనగా కేవలం కాల్విన్ క్లైన్ బ్రానే వేసుకుంది. దీంతో నెటిజన్లు దిశపై కారాలూ మిరియాలూ నూరుతున్నారు. పండగ పూట బ్రా యాడ్స్ పోస్ట్ చేయడం ఏంటి? శుభమా అంటూ దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ డ్రెస్ ఏంటి దిశా? పద్దతిగా డ్రెస్ చేసుకొని శుభాకాంక్షలు చెప్పలేవా అని హితవు పలుకుతున్నారు. చాతనైతే పండుగలకు పద్దతిగా శుభాకాంక్షలు తెలుపు, లేదంటే సైలెంట్‌గా ఉండు అని హెచ్చరిస్తున్నారు.

దిశా పెట్టిన పోస్టుకు ఏడు వేల కామెంట్స్ నమోదుకాగా అందులో ఎక్కువ కామెంట్స్ నెగటివ్‌గా వచ్చాయి. దీనితో సింపుల్‌గా అన్ని కామెంట్స్‌ని డిలీట్ చేసింది దిశా. మరోవైపు ఈ ఫొటోకు పదిహేను లక్షల లైక్స్ రావడం గమనార్హం. దిశా పటాని నెటిజన్ల ఆగ్రహానికి గురికావడం ఇదే తొలిసారి కాదు గతంలో కూడా ఈ భామ అసభ్యకర పోస్ట్‌లు పెట్టి నెటిజన్ల ఆగ్రహానికి గురైనది. చూడాలి మరి ఈ ఫోటో మీద దిశా వివరణ ఎలా ఉంటుందో.

View this post on Instagram

A post shared by disha patani (paatni) (@dishapatani) on

Untitled Document
Advertisements