కేదర్నాథ్ ఆలయంలో మోది పూజలు

     Written by : smtv Desk | Wed, Nov 07, 2018, 01:47 PM

 కేదర్నాథ్ ఆలయంలో మోది పూజలు

ఉత్తరాఖండ్, నవంబర్ 7: దీపావళి పర్వదినాన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుదవారం ఉదయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గల కేదార్‌నాథ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి విపత్తుల నుంచి ఆలయాన్ని కాపాడుకోవడానికి, ఆలయ పరిసర ప్రాంతాలలో యాత్రికులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు జరుగుతున్న వొక్కొక్క పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి నుంచి హెలికాఫ్టరులో పంజాబ్ సరిహద్దులకు వెళ్ళి అక్కడ గస్తీ కాస్తున్న భద్రతదళాలతో కలిసి దీపావళి పండుగ జరుపుకొంటారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండా కేదార్‌నాథ్‌ దర్శించుకొని అక్కడి నుంచి సరిహద్దులకు వెళ్ళి సైనికులతో కలిసి దీపావళి పండుగ జరుపుకొంటున్నారు.

Untitled Document
Advertisements