తెలంగాణ ఎన్నికలకు పలువురు ప్రముఖులు

     Written by : smtv Desk | Wed, Nov 07, 2018, 02:39 PM

తెలంగాణ ఎన్నికలకు పలువురు ప్రముఖులు

హైదరాబాద్, నవంబర్ 7: తెలంగాణాలో రానున్న ఎన్నికల సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం ప్రజల్లో ఓటుహక్కుపై చైతన్యం పెంచడానికి నగరంలోని పలువురు ప్రముఖులను అంబాసిడర్లుగా నియమించుకుంటున్నామని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. మెజారిటీ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం తగ్గుముఖం పడుతుండడం ఎన్నికల సంఘాన్ని కలవరపెడుతోంది.

అయితే అంబాసిడర్లుగా టాలీవుడ్ నటుడు విజయ దేవరకొండను పాలమూరు జిల్లాకు ప్రత్యేక అంబాసిడర్‌గా నియమించారు అలాగే ప్రముఖ క్రికెటర్ వి.వి.ఎస్ లక్ష్మణ్, ప్రజాకవి గోరెటి వెంకన్న, టెన్నిస్ సంచలనం సానియా మీర్జా, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్‌లను కూడా అంబాసిడర్లుగా నియమించారు.

Untitled Document
Advertisements