‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’కి అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు

     Written by : smtv Desk | Wed, Nov 07, 2018, 03:16 PM

‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’కి అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు

ఇంగ్లాండ్, నవంబర్ 7: భారత తొలి ఉప ప్రధాని, హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్నిభారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన 183 మీటర్ల పొడవుతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. అయితే ఈ విగ్రహానికి చాలా విమర్శలు వస్తూనే వున్నాయి. 562 సంస్థానాలను ఇండియన్ యూనియన్‌లో కలిపిన ఉక్కు మనిషి సర్దార్ పటేల్‌కు సముచిత గౌరవం కల్పించామని మోదీ ప్రభుత్వం భావిస్తుంది. కానీ బ్రిటన్ నేతలు మాత్రం దీనికి పూర్తి వ్యతిరేఖంగా వ్యవహరిస్తున్నారు.

ఈ విగ్రహంపై కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ పీటర్ బోన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘అదొక చెత్త పని. మా నుంచి వేల కోట్ల అప్పులు తీసుకెళ్లేది విగ్రహాలు నిర్మించుకోవడానికేనా? భారత్ అంతగా వేల కోట్లు పెట్టి విగ్రహాలు నిర్మించుకునే స్థితిలో ఉంటే దానికి మేం ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం లేదు.. అని అన్నాడు. ‘భారత ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. మేం ఐదేళ్లలో భారత్‌కు పలు ప్రత్యేక ప్రాజెక్టుల కోసం నిధులను అందజేశాం. మా నుంచి రూ.9,492 కోట్లను ఆర్థిక సాయం రూపంలో భారత్‌ తీసుకుంది. మహిళల హక్కులకు సంబంధించి, పునరుత్పాదక ఇంధన రంగంలోని ప్రాజెక్టులు, మతపరమైన సహనం పెంపొందించడానికి ఈ నిధులను సాయం రూపంలో అందించాం. కానీ, ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ వంటి ప్రాజెక్టులకు భారత్‌ వేలకోట్ల రూపాయలు వెచ్చించగలుగుతున్నప్పుడు ఇక మా సాయం అనవసరం అని అన్నారు.





Untitled Document
Advertisements