బాలికపై గ్యాంగ్ రేప్

     Written by : smtv Desk | Thu, Nov 08, 2018, 12:56 PM

బాలికపై గ్యాంగ్ రేప్

ఇంట్లో ఓ బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఇద్దరు దుండగులు దారుణానికి తెగబడ్డారు. ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడటంతో పాటు ఘటనాస్థలం నుంచి పారిపోయారు. . ఈ ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల వివరాల ప్రకారం జిల్లాలోని అయినవిల్లి మండలం, అయినవిల్లిలంకలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు కన్నేశారు. ఈ నేపథ్యంలో నిన్న బాలిక ఇంట్లో ఉండటాన్ని గమనించిన ఇద్దరు యువకులు ఇంట్లోకి దూరి ఆమెను బంధించారు.

అనంతరం బలవంతంగా నోట్లో గుడ్డలు కుక్కి గ్యాంగ్ రేప్ చేశారు. ఆ తర్వాత ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. చివరికి తల్లిదండ్రులతో కలిసి బాలిక పోలీసులను ఆశ్రయించడంతో అధికారులు కేసు నమోదుచేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Untitled Document
Advertisements