ఆ గ్రామంలో ఉన్నది కేవలం నలుగురు ఓటర్లే

     Written by : smtv Desk | Thu, Nov 08, 2018, 01:12 PM

ఆ గ్రామంలో ఉన్నది కేవలం నలుగురు ఓటర్లే

ఛత్తీస్ గఢ్, నవంబర్ 08: నవంబర్ 12న ఛత్తీస్ గఢ్ లో తొలి దశ పోలింగ్ జరగనుంది. అయితే ఈ క్రమంలో భరత్ పూర్ – సోన్ హట్ నియోజకవర్గంలోని షిరందఢ్ గ్రామంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ గ్రామంలో ఉన్నది కేవలం నలుగురే ఓటర్లు. వాళ్లలో ముగ్గురు వొకే కుటుంబానికి చెందిన వారట. అయితే.. షిరందఢ్ అనే గ్రామం అడవిలో ఉంటుందట. అక్కడికి వెళ్లడానికి ఎటువంటి రవాణా సౌకర్యం ఉండదట. అయినా.. పోలింగ్ కు ముందు రోజు ఆ ఊరికి వెళ్లి పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.

అయితే వంద శాతం ఓటింగ్ నమోదు చేయాలన్న లక్ష్యంతో ఈసీ పనిచేస్తున్నది. దానిలో భాగంగానే ఓటర్లు ఎంతమంది ఉన్నా.. రవాణాకు దూరంగా ఉన్న ఊళ్లయినా.. అడవయినా ఎక్కడైనా.. పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేస్తున్నారు.

Untitled Document
Advertisements