ట్రంప్ మరో సంచలన నిర్ణయం

     Written by : smtv Desk | Thu, Nov 08, 2018, 01:21 PM

ట్రంప్ మరో సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఆ దేశ అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్‌ను ఆ పదవి నుంచి తొలగించారు. ఒక ట్వీట్ ద్వారా తన నిర్ణయాన్ని చెప్పిన ట్రంప్, సెషన్స్ స్థానంలో తన చీఫ్ ఆఫ్ స్టాఫ్ మాథ్యూ విట్కర్‌ను తాత్కాలికంగా నియమిస్తున్నట్టు తెలిపారు.‘అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్‌గా మాథ్యూ.జి.వైటేకర్‌ను నియమిస్తున్నాం. ఈ రోజు నుంచి ఆయన తన సేవలను అందిస్తారు. ఇప్పటివరకూ అటార్నీ జనరల్‌గా సేవలందించిన జెఫ్‌ సెషన్స్‌కు ధన్యవాదాలు. ఆయనకు అంతా మంచే జరగాలని ప్రార్థిస్తున్నా. త్వరలోనే కొత్త అటార్నీ జనరల్‌ను నియమిస్తాం’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు

మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో రాజీనామా చేస్తున్నట్టు సెషన్స్ ఒక లేఖలో తెలిపారు.సెషన్స్ తన లేఖలో "ప్రియమైన అధ్యక్షుడికి, మీరు కోరినట్లు నా రాజీనామాను అందిస్తున్నాను" అని రాశారు.ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపిన సెషన్స్ "నేను అటార్నీ జనరల్‌గా ఉన్న సమయంలో మనం చట్ట నియమాలను పునరుద్ధరించడం చాలా కీలకంగా భావిస్తున్నాను" అన్నారు.2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రష్యా సాయం తీసుకోవడంపై సీరియస్ గా విచారణ జరిపిన ఎఫ్ బీఐ చీఫ్ రాబర్ట్ ముల్లర్ సహా పలువురిని ట్రంప్ ఇటీవల సాగనంపారు.

Untitled Document
Advertisements