ఫ్యాన్స్ పై విరాట్ కోహ్లీ ఫైర్

     Written by : smtv Desk | Thu, Nov 08, 2018, 01:30 PM

ఫ్యాన్స్ పై  విరాట్ కోహ్లీ ఫైర్

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ వివాదంలో చిక్కుకున్నాడు. అతడిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దేశం వెళ్లిపొమ్మంటూ ఓ అభిమానిపై కోహ్లీ ఘాటు వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణం.. తాజాగా 30వ ఒడిలోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ... తన పుట్టినరోజున పంపిన శుభాకాంక్షల ట్వీట్లను చదువుతూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో ఓ నెటిజన్... ‘విరాట్ కోహ్లీ ఓవర్ రేటెడ్ బ్యాట్స్‌మెన్. నాకు అతని బ్యాటింగ్‌లో పెద్దగా ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. నీలాంటి భారత క్రికెటర్ల కంటే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీమ్ బ్యాట్స్‌మెన్లు ఆడే ఆటే నాకెంతో బాగా నచ్చుతుంది...’ అంటూ ట్వీట్ చేశాడు. దీనికి విరాట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వీడియో ట్వీట్ చేశాడు... ‘నా ఆటతీరు నచ్చకపోతే అది నీ పర్సనల్ విషయం. దాని గురించి నేనేమీ మాట్లాడను. కానీ భారత దేశంలో ఉంటూ వేరే దేశాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావ్. నా దేశాన్ని ఇష్టపడని నీకు ఇక్కడుంటే అర్హత లేదు. దేశం విడిచి ఎక్కడికైనా వెళ్లిపోతే బాగుంటుంది... ’ అంటూ గట్టిగా సమాధానం చెబుతూ వీడియో పోస్ట్ చేశాడు విరాట్ కోహ్లీ.

Untitled Document
Advertisements