'బిజినెస్ మ్యాన్' గా ఎదుగుతున్న మహేష్

     Written by : smtv Desk | Thu, Nov 08, 2018, 03:39 PM

'బిజినెస్ మ్యాన్' గా ఎదుగుతున్న మహేష్

హైదరాబాద్, నవంబర్ 08: టాలివుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య బిజినెస్ మ్యాన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. మహేష్ బాబు సినిమాలు చేయడమే కాదు బిజినెస్ లు కూడా మొదలు పెట్టాడు. ఈమధ్యనే మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు లేటెస్ట్ గా ప్రొడక్షన్ హౌజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాడట. అదేంటి ఆల్రెడీ మహేష్ కు సొంతంగా బ్యానర్ ఎప్పటి నుండో ఉంది కదా అంటే ఇన్నాళ్లు కేవలం తను నటించే సినిమా సమర్పణ, ఇంకా ప్రాఫిట్ లో షేర్ లాంటివి మాత్రమే తీసుకునే మహేష్ లేటెస్ట్ గా ఎంబి ప్రొడక్షన్ కోసం ఓ టీం ఏర్పాటు చేశాడట.

ఇక నుండి ఆ టీమ్ నుండి కొత్త సినిమాలు వస్తాయని తెలుస్తుంది. ఈమధ్య వచ్చిన ఆరెక్స్ 100, చిలసౌ లాంటి ప్రయోగాత్మక చిన్న సినిమాలు విజయం సాధించడంతో మహేష్ కూడా తన టీంతో కొత్త అటెంప్టులు చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే పెద్ద ప్రొడక్షన్ హౌజులు చిన్న బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు. రాం చరణ్ కూడా నిర్మాణ రంగంలోకి వచ్చాడు. ఇక మహేష్ కూడా సినిమాలను నిర్మిస్తాడట. ముఖ్యంగా చిన్న సినిమాల మీద మహేష్ ఫోకస్ ఉందని తెలుస్తుంది. మరి మహేష్ నిర్మాతగా ఎలాంటి సినిమాలు చేస్తాడో చూడాలి.

Untitled Document
Advertisements