నోట్లరద్దుకు రెండేళ్లు పూర్తి

     Written by : smtv Desk | Thu, Nov 08, 2018, 03:43 PM

నోట్లరద్దుకు రెండేళ్లు పూర్తి

నోట్లరద్దుకు రెండేళ్లు పూర్తి అయ్యాయి. రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు పెద్ద నోట్ల రద్దును ప్రకటించి, తన కేబినెట్ సహచరులతో పాటు మొత్తం దేశప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తారు ప్రధాని మోడీ. నోట్ల రద్దుతో నల్లధనాన్ని అరికట్టడమే కాదు ఉగ్రవాదం, తీవ్రవాదానికి చెక్‌ పెట్టొచ్చని ప్రకటించారు. . ప్రధాని ఆ రోజు రాత్రి 8 గంటలకు చేసిన ప్రసంగంలో.. రాత్రి 12 గంటల నుంచి 500, 1000 రూపాయల నోట్లు చెల్లుబాటు కావని తేల్చి చెప్పారు.

500, 1000 నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణ జరిగిందన్నారు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. పన్ను వసూళ్లు పెరిగాయని, అభివృద్ధి రేటు కూడా పెరిగిందని ప్రకటించారు. అయితే జైట్లీ స్టేట్‌మెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. నోట్ల రద్దు పెద్ద స్కామని ఆరోపిస్తున్నాయి.

Untitled Document
Advertisements