కుమార స్వామి , దేవగౌడ్ తో ముగిసిన బాబు భేటి

     Written by : smtv Desk | Thu, Nov 08, 2018, 05:27 PM

బెంగుళూరు, నవంబర్ 08: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కర్ణాటక సిఎం కుమారస్వామి , మాజీ ప్రధాని దేవగౌడ్ తో చర్చించిన అనంతరం బాబు మీడియా తో మాట్లాడుతూ ''ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని కాపాడుకోవాలంటే దేవగౌడ్ లాంటి నేతలు మనకు ఎంతో ముఖ్యం అని పేర్కొన్నారు. ఇంకా కేంద్ర అధికారం దుర్వినియోగ పాలయింది అంటూ వాపోయారు. అలాగే ఆర్బిఐ, సేబేఐ, ఈడి వంటి ప్రభుత్వ రంగాలు నిర్వీర్యమయ్యాయి అంటూ వెల్లడించారు.''

అనంతరం దేవగౌడ్ మాట్లాడుతూ ''గత 4 సవంత్సరాలనుండి ఎన్డియే అన్ని రంగాల్లో వైఫల్యం చెందుతుంది అంటూ అన్ని లౌకిక పార్టీలను ఎకతాటిగా నిలుపాలని చంద్రబాబు చాలా ప్రయత్నిస్తున్నారని అలాగే మోది ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఇది చాలా అవసరమవుతందని పేర్కొన్నారు. సెక్యులర్ పార్టీలను కూడా ఎకతాటిగా తీసుకురావాలని బాబు గారు చూస్తున్నారని'' చెప్పుకొచ్చారు.
వచ్చే ఎన్నికల్లో ప్రధాన అభ్యరి ఎవరనేది త్వరలోనే నిర్ణయించి వెల్లడిస్తాం అని బాబు గారు చెప్పారు.

Untitled Document
Advertisements