రికార్డులు కొల్లగొడుతున్న సర్కార్

     Written by : smtv Desk | Fri, Nov 09, 2018, 12:54 PM

రికార్డులు కొల్లగొడుతున్న సర్కార్

తమిళనాడు, నవంబర్09: దీపావళి సందర్భంగా తెలుగు, తమిళంలో విడుదలయిన చిత్రం సర్కార్. విజయ్, మురగదాస్ కాంబినేషన్ లో వొచ్చినా ఈ చిత్రం ప్రస్తుతం మంచి వసూళ్లను రాబడుతుంది. అంతేకాకుండా రికార్డులు కూడా కొల్లగొడుతుంది. సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది. బాహుబలి2 ఫస్ట్ డే కలెక్షన్లను కూడా ఈ సినిమా బీట్ చేసిందట.

ఇక.. మరో రికార్డేమిటంటే.. గూగుల్ ట్రెండ్స్ లో సర్కార్ సినిమాలో ఉన్న ఓ సెక్షన్ టాప్ లో ఉంది. అవును.. సినిమాలో సెక్షన్ 49పీ గురించి చర్చ ఉంటుంది. అరె.. ఇటువంటి సెక్షన్ ఒకటుందా? మాకు తెలియదే? అంటూ గూగులమ్మకు పని చెప్పారు. దీంతో గూగుల్ ట్రెండ్స్ లో టాప్ పొజిషన్ లో ఈ పదం వచ్చి చేరింది. దీనికి సంబంధించిన ఫోటోను సర్కార్ సినిమా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.Untitled Document
Advertisements