హీరోయిక్ క్యాచ్ పట్టిన అభిమాని వీడియో వైరల్

     Written by : smtv Desk | Sat, Nov 10, 2018, 02:15 PM

హీరోయిక్ క్యాచ్ పట్టిన అభిమాని వీడియో వైరల్

అడిలైడ్‌, నవంబర్ 10: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ అడిలైడ్‌ స్టేడియంలో శుక్రవారం జరిపిన ప్రదర్శన పేలవంగా ముగిసింది. దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 7 పరుగుల తేడాతో గెలుపొందినా.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌ని సఫారీ బ్యాట్స్‌మెన్ ఉతికారేశారు.

ముఖ్యంగా.. మార్క్‌రమ్ (19: 17 బంతుల్లో 2ఫోర్లు, 1 సిక్సు) బాదిన ఓ సిక్స్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. 150.8 కిమీ వేగంతో మిచెల్ స్టార్క్ ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా బంతిని విసరగా.. మిడ్ వికెట్ దిశగా దాన్ని మర్‌క్రమ్ స్టాండ్స్‌లోకి తరలించేశాడు. 95 మీటర్ల దూరంలో పడిన ఆ బంతిని.. స్టాండ్స్‌లో ఓ అభిమాని క్యాచ్‌గా అందుకుని కొన్ని క్షణాలు సంబరాలు చేసుకున్నాడు.

Untitled Document
Advertisements