డ్రంక్ అండ్ డ్రైవ్ లో సంచలనం సృష్టించిన యువతి

     Written by : smtv Desk | Mon, Nov 12, 2018, 11:24 AM

డ్రంక్ అండ్ డ్రైవ్ లో సంచలనం సృష్టించిన యువతి

హైదరాబాద్, నవంబర్ 12: నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 45లో శనివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన క్రమంలో కారునడుపుతూ వచ్చిన వో యువతిని ట్రాఫిక్‌ పోలీసులు నిలువరించి పరీక్ష చేయగా శ్వాస విశ్లేషణ పరికరం 536 పాయింట్లు చూపింది. వొక యువతి ఇంత మొత్తంలో తాగిందా? అని నమ్మలేక పోలీసులు మళ్లీ పరీక్షించి నిర్ధారించుకుని ఆశ్చర్యపోయారు. సాధారణంగా 100 మిల్లీలీటర్ల రక్తంలో ఆల్కహాల్‌ పరిమాణం 30 మిల్లీగ్రాములు దాటితే పరిమితికి మించి తాగినట్లుగా పరిగణించి కేసు పెడతారు. వొక్క బీరు తాగితే శ్వాస విశ్లేషణ పరికరం సుమారుగా 30 నుంచి 35 పాయింట్లు చూపుతుందని పోలీసుల అంచనా.





Untitled Document
Advertisements