గాయాలపాలైన రాఖీ సావంత్

     Written by : smtv Desk | Mon, Nov 12, 2018, 04:43 PM

గాయాలపాలైన రాఖీ సావంత్

చండీగఢ్‌, నవంబర్ 12: ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ చండీగఢ్‌లోని తావుదేవి లాల్ స్టేడియంలో జరుగుతోన్న సిడబ్ల్యుఈ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్‌ని చూసేందుకు వెళ్లి తీవ్ర గాయలపాలయ్యింది. అక్కడ పోటీల్లో పాల్గొన్న మహిళా రెజ్లర్ రోబెల్ చేసిన ఛాలెంజ్‌ని స్వీకరించి రింగ్‌లోకి వెళ్లిన రాఖీ గాయాలతో బయటికి వచ్చింది.రోబెల్ మాట్లాడుతూ ఇక్కడ నాతో పోటీపడే సత్తా ఉన్నవారు రింగ్‌లోకి రావాలని ఛాలెంజ్ విసిరింది. దీనితో రాఖీ రింగ్‌లోకి వెళ్లి రోబెల్‌తో తనతో సమానంగా డాన్స్ చేయాలనీ కోరింది. రాఖీ కోరినట్టుగా రోబెల్ డాన్స్ చేసింది. డాన్స్ చేయడం ముగిసిన తరువాత రోబెల్ రాఖీని వొక్కసారిగా అమాంతం ఎత్తుకొని ఫ్లోర్ మీద పడేయడంతో రాఖీ తీవ్రంగా గాయపడి ఎనిమిది నిమిషాల పాటు కొట్టుమిట్టాడింది. వెంటనే అక్కడున్న సిబ్బంది అలెర్ట్ అయి రాఖీని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాఖీ జీరాఖ్ పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

Untitled Document
Advertisements