ప్రారంభం రోజే 48 నామినేషన్లు నమోదు

     Written by : smtv Desk | Tue, Nov 13, 2018, 12:42 PM

ప్రారంభం రోజే 48 నామినేషన్లు నమోదు

హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణలో ముందస్తు ఎన్నికల సందర్భంగా సోమవరం నుండి నామినేషన్ ల ప్రక్రియ మొదలవగా ప్రారంభం రోజే మొత్తం 48 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్, టిడిపి, సిపిఐలు తమ అభ్యర్ధుల జాబితాలను ప్రకటించక మునుపే ఆరుగురు కాంగ్రెస్‌, ఇద్దరు టిడిపి, ఇద్దరు సిపిఐ అభ్యర్ధులు నామినేషన్లు వేయడం విశేషం.
మొదటి రోజున తెరాస-10 మంది, కాంగ్రెస్‌-6, టిడిపి-2, బిజెపి-9, సిపిఐ-2, సిపిఎం-1, బిఎల్ఎఫ్-2, పిపిఐ-2, ఆప్-2, బిఎస్పీ-1, స్వతంత్ర అభ్యర్ధులు-11 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
నిన్న నామినేషన్లు దాఖలు చేసిన వారిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ (ముషీరాబాద్), రాజాసింఘ్(ఘోషా మహల్), గొంగిడి మనోహర రెడ్డి (మునుగోడు) రఘునందన్‌రావు(దుబ్బాక); బల్మూరి వనిత(రామగుండం), డాక్టర్‌ పీ విజయచందర్‌రెడ్డి(పరకాల), ఆలే జితేంద్ర(మలక్‌పేట), టీ ఉమామహేందర్‌(చార్మినార్‌), ఆకుల విజయ(సనత్‌నగర్‌)నామినేషన్లు వేశారు. ఇదే నియోజకవర్గం నుంచి పల్వాయ్ శ్రావణ్ స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్లు వేశారు.
యదాద్రి భూయవనగిరి జిల్లాలో ఆలేరు నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్ధి గొంగిడి సునీత, కాంగ్రెస్‌ తరపున బి.బిక్ష్మయ్య గౌడ్, బి. సువర్ణ నామినేషన్లు వేశారు.
కాంగ్రెస్ అభ్యర్ధులుగా ఆకుల లలిత(ఆర్మూర్‌), రాజనాల శ్రీహరి(వరంగల్‌ ఈస్ట్‌)నామినేషన్లు వేశారు.
నల్గొండ జిల్లాలో స్వతంత్ర అభ్యర్ధులుగా మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి లాలూ నాయక్, సుంకు శ్రీనివాసులు, నల్గొండ నియోజకవర్గం నుంచి మాజీ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ నామినేషన్లు వేశారు.
కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున చల్లా వంశీచంద్, తెరాస అభ్యర్ధి జి జైపాల్ యాదవ్ నామినేషన్లు వేశారు.
ఆదిలాబాద్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా తొగరి నర్సింహులు, ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి తెరాస అభ్యర్ధి కోవ లక్ష్మి, కాంగ్రెస్‌ తరపున ఏ సక్కు, నామినేషన్లు వేశారు.
శేరిలింగంపల్లి నుంచి బిఎల్ఎఫ్ అభ్యర్ధి తాండ్ర కుమార్, తాండూరు నుంచి టిడిపి తరపున రాజు గౌడ్ నామినేషన్లు వేశారు. భద్రాచలం నియోజకవర్గం నుంచి సిపిఎం తరపున మిడియం బాబూరావు నామినేషన్లు వేశారు.

Untitled Document
Advertisements