అంగరంగ వైభవంగా దీపిక, రణ్‌వీర్‌ సంగీత్.

     Written by : smtv Desk | Tue, Nov 13, 2018, 05:51 PM

 అంగరంగ వైభవంగా దీపిక, రణ్‌వీర్‌ సంగీత్.

ముంబై, నవంబర్ 13: ఈనెల 14, 15 తేదీల్లో బాలీవుడ్‌ నటి దీపిక పదుకొనె, రణ్‌వీర్‌సింగ్‌లు ఇటలీలోని లేక్‌ కోమోలో అంగరంగ వైభవంగా జరిగే వివాహంతో ఒక్కటవుతున్న క్రమంలో కళ్లు చెదిరే ఏర్పాట్లతో పెళ్లి వేదిక ముస్తాబవుతోంది. ఇటలీలో ఈ హాట్‌ కపుల్‌ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు వేదికైన విల్లా డెల్‌ బాల్బినెల్లో సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. పెళ్లికొడుకు రణ్‌వీర్‌సింగ్‌ సీప్లేన్‌లో వేదికకు వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సింధ్‌ సంప్రదాయం ప్రకారం, దక్షిణాది పద్ధతిలో రెండు సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ పెళ్లి వేడుక జరగనుంది. పెళ్లి మంటపాన్ని అలంకరించేందుకు ఫ్లోరెన్స్‌ నుంచి పన్నెండు మంది పుష్పాలంకరణ నిపుణులను రప్పించారు.

పెళ్లి వేడుక జరిగే విల్లాలో ఎవరూ విడిది చేయకపోవడంతో కొత్త జంటతో పాటు అతిధులందరికి పక్కనే ఉన్న బ్లెవియో విలేజ్‌లోని రిసార్ట్‌ అంతటినీ బుక్‌ చేశారు. అత్యంత ఖరీదైన ఈ రిసార్ట్‌నూ పూలతో అలంకరించారు. ఈ రిసార్ట్స్‌లో నాలుగు రెస్టారెంట్లు, బార్లు, కాన్ఫరెన్స్‌ రూమ్‌లు, స్పా, ఇండోర్‌ స్విమ్మింగ్‌పూల్‌ ఉన్నాయి.

26,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన రిసార్ట్స్‌ను కలియతిరిగేందుకు గోల్ఫ్‌ కార్ట్స్‌ అందుబాటులో ఉంచారు. ఈ రిసార్ట్ప్‌లో ఒక్కో​ రూమ్‌కు రోజుకు రూ 33,000 వసూలు చేస్తారు. మొత్తం 75 రూమ్‌లకు వారం రోజులకు గాను 1.73 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రిసార్ట్స్‌ నుంచి పెళ్లి వేదికకు చేరుకునేందుకు అతిధుల కోసం ఇప్పటికే రణ్‌వీర్‌ ప్రత్యేక నౌకలను బుక్‌ చేశారు. ఇక అతిధులకు పెళ్లి విందులో నోరూరించే వంటకాలను సిద్ధం చేసేందుకు స్విట్జర్లాండ్‌ నుంచి చెఫ్‌లు లేక్‌కోమో చేరుకున్నారు. రేపు జరగబోయే వివాహానికి సంబంధించిన సంగీత్ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అయింది. బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఈ సంగీత్ లో పాల్గొంటున్నట్టు సమాచారం.

Untitled Document
Advertisements