కూటమిలో కీలక పాత్రగా మారిన ప్రముఖ పార్టీ

     Written by : smtv Desk | Wed, Nov 14, 2018, 06:51 PM

కూటమిలో కీలక పాత్రగా మారిన ప్రముఖ పార్టీ

హైదరాబాద్, నవంబర్ 14: తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో తెరాస కు వ్యతిరేఖంగా రూపొందించిన మహాకూటమి లో ప్రధాన పాత్ర తెదేప పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ బయటకు కనపడుతుందే కానీ మొత్తం అమరావతి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కథ నడుపుతున్నారంటూ..పలువురు నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ తొలి జాబితాలో సీట్ల కేటాయింపులోనూ బాబు తన పాత్ర పోషించారని అసమ్మతి వాదులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో రోజరోజుకి ప్రభావం తగ్గుతున్న తేదపాతో కాంగ్రెస్ కలవడం పెద్దతప్పుగా ఆ పార్టీ నేతలు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ఇందులో భాగంగానే బాబు వొత్తిడి వల్లే గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఏమాత్రం పోటీ లేని నియోజకవర్గాల్లో సైతం పార్టీ అధిష్టానం కొందరు కాంగ్రెస్‌ ప్రముఖుల సీట్లను పెండింగ్‌లో పెట్టిందని తెలుస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాకు చంద్రబాబు ఆమోదం కోసమే రాహుల్‌ గాంధీ దూతగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ ఏపీ రాజధాని అమరావతిలో ఆయనతో సమావేశమయ్యారన్న ప్రచారం సోమవారం ప్రకటించిన మొదటి జాబితాతోనే తేటతెల్లమైందని ఈ పరిణామాలన్నింటిని గమనించినట్లైతే మహాకూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు చెప్పినట్లే మంత్రివర్గం కూర్పు సహా ఇతర అంశాలు ముడిపడి ఉండేటట్లు కనిపిస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.





Untitled Document
Advertisements