బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గూగుల్ డూడుల్

     Written by : smtv Desk | Wed, Nov 14, 2018, 06:58 PM

బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గూగుల్ డూడుల్

ముంబై, నవంబర్ 14: నేడు భారత మొట్ట మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జన్మదిన సందర్భంగా ఆయనకు నివాళిగా దేశమంతా ప్రతీ సవంత్సరం బాలల దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఆయన పుట్టింది నవంబర్ 14, 1889న.
అయితే ఈ సందర్భంగా ఓ విద్యార్థిని తాయారు చేసిన గూగుల్ డూడుల్ ని గూగుల్ తన హోం పేజి పై ఏర్పాటు చేసింది. ముంబైకి చెందిన పింగ్లా రాహుల్ అనే విద్యార్థిని ఈ డూడుల్ ను తయారు చేసింది. ఆమె తయారు చేసిన ఈ డూడుల్ 2018 డూడుల్ ఫర్ గూగుల్ కాంపిటీషన్ ను గెలుచుకుంది. అందుకే ఇవాళ ఆమె డూడుల్ ను గూగుల్ హోమ్ పేజీలో సెట్ చేశారు. ఆ డూడుల్ ను పరీక్షించి చూస్తే అంతరిక్షాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. టెలిస్కోప్ సాయంతో ఓ అమ్మాయి ఆకాశాన్ని చూస్తుంటుంది. ఆ డూడుల్ లోనే అంతరిక్షంలో ఉండే గెలాక్సీలు, ప్లానెట్స్, స్పేస్ క్రాఫ్ట్స్ అన్నింటినీ గూగుల్ అక్షరాలతో లింక్ చేసి చూపించింది ఆ విద్యార్థిని. స్పేస్ ను కళ్లకు కట్టినట్టు చూపించిన ఆ విద్యార్థిని డూడుల్ అందుకే కాంపిటిషన్ లోనూ విన్నయింది.





Untitled Document
Advertisements