అభ్యర్దుల రెండో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్

     Written by : smtv Desk | Wed, Nov 14, 2018, 07:00 PM

అభ్యర్దుల రెండో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్

హైదారబాద్, నవంబర్ 14: తెలంగాణ రానున్న ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తాజాగా 10 మందితో కూడిన రెండవ జాబితాను విడుదల చేసింది. 65 మందితో కూడిన మొదటి జాబితాను మొన్న రాత్రి విడుదల చేయగా ఆ జాబితాలో పేర్లు లేని నాయకులు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. కావున ఈ రోజు మళ్ళి మిగిలిన వారి జాబితాను ప్రకంటించింది. దీనితో ఇప్పటి వరకు 75 మంది పేర్లను ప్రకటించింది. అయితే రెండవ జాబితాలో కూడా పొన్నాల లక్ష్మయ్య, బండ్ల గణేష్‌ల పేర్లు లేకపోవడం గమనార్హం.

కాంగ్రెస్ రెండవ జాబితా..
ఖానాపూర్ – రమేష్ రాథోడ్
ఎల్లారెడ్డి – జజాల సురేందర్
ధర్మపురి – అడ్లూరి లక్ష్మణ్ కుమార్
సిరిసిల్ల – కే కే మహేందర్ రెడ్డి
మేడ్చల్ – కిచ్చన్నగారి లక్ష్మా రెడ్డి
ఖైరతాబాద్ – శ్రవణ్ దాసోజు
జూబ్లీ హిల్స్ – విష్ణువర్ధన్ రెడ్డి
షాద్ నగర్ – సి ప్రతాప్ రెడ్డి
భూపాలపల్లి – గండ్ర వెంకట రమణ రెడ్డి
పాలేరు – కందాల ఉపేందర్ రెడ్డి
మూడో జాబితా ఎప్పుడు విడుదల చేసే విషయం మీద ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.





Untitled Document
Advertisements