‘ఎంత కష్టాలో ఉన్నా..మీ ప్రేమే నా బలం’

     Written by : smtv Desk | Wed, Nov 14, 2018, 07:06 PM

‘ఎంత కష్టాలో ఉన్నా..మీ ప్రేమే నా బలం’

హైదరాబాద్‌, నవంబర్ 14: ఎంత బాధలో ఉన్నా తనకు అభిమానుల ప్రేమే బలాన్నిస్తుందని అంటున్నారు యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. ఆయన హీరో గా నటించిన ‘టాక్సీవాలా చిత్రం పైరసీకి గురైనవిషయం తెలిసిందే. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తికాకుండా సినిమా మొత్తం ఆన్‌లైన్‌లో లీక్‌ కావడంతో విజయ్‌ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కాగా..ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌నురిలీజ్ చేశారు. ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. యూట్యూబ్‌లో ట్రైలర్‌ను దాదాపు 40 లక్షల మంది వీక్షించారు.





ఈ విషయాన్ని విజయ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ..అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘నేను బాధలో ఉన్నప్పుడు నాకు ధైర్యం ఇచ్చేదెవరో తెలుసా? మీరే. నా చుట్టూ ఉన్న శబ్దంలో మీ ప్రేమే నాకు గట్టిగా వినిపిస్తుంది అని ట్వీట్‌లో పేర్కొన్నారు. విజయ్‌ ట్వీట్‌పై ప్రముఖ నటుడు సూర్య స్పందించారు. ‘నీకు మా అందరి ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇవేవీ చిరకాలం కాదు . కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ ఇక్కడే ఉంటావు. ‘టాక్సీవాలా సినిమా కోసం నేను చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. అని ట్వీట్‌ చేశారు. ఇందుకు విజయ్‌ ప్రతిస్పందిస్తూ..‘లవ్యూ సూర్య సర్‌ అన్నారు.

‘టాక్సీవాలా చిత్రానికి రాహుల్‌ దర్శకత్వం వహించారు. ప్రియాంక జవాల్కర్‌ కథానాయిక. జీఏ2, యూవీ క్రియేషన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నవంబర్‌ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోపక్క సూర్య ‘ఎన్‌జీకే చిత్రంతో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ సెల్వరాఘవన్ వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు.





Untitled Document
Advertisements