రెండో పెళ్లికి రెడీ అంటూన్న రజనీకాంత్ కూతురు

     Written by : smtv Desk | Wed, Nov 14, 2018, 07:12 PM

రెండో పెళ్లికి రెడీ అంటూన్న రజనీకాంత్ కూతురు

హైదరాబాద్ ,నవంబర్ 14: సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారు. తన మొదటి భర్త నుంచి సౌందర్య రజనీకాంత్ విడాకులు పొందిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే పెళ్లి వార్త విషయం సూపర్‌స్టార్ సన్నిహితులకు, కుటుంబ సభ్యులకే తెలిసింది. తాజాగా బయటకు రావడంతతో ఈ విషయం కాస్త మీడియాలో వైరల్ అయింది. సౌందర్య వివాహం 2010 జూలైలో పారిశ్రామిక వేత్త అశ్వినీ కుమార్‌తో జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజులకే వ్యక్తిగత అభిప్రాయ బేధాలు తలెత్తాయి. దాంతో విడిపోవాలని నిర్ణయించుకొన్నారు.

వీరిద్దరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. 2017లో అశ్విన్ నుంచి సౌందర్య రజనీకాంత్ విడాకులు పొందారు. అప్పటి నుంచి వొంటరిగానే ఉంటున్నారు. సౌందర్య రజనీకాంత్ కాబోయే భర్త విషాగన్ వనంగముడి ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీకి యజమాని. తమిళనాడులోని ప్రముఖ పారిశ్రామిక వేతత్త వనంగముడి కుమారుడు. ప్రతిష్టాత్మక కుటుంబంలోని వ్యక్తిని సౌందర్య రజనీకాంత్ భాగస్వామిగా ఎంచుకోబోతున్నారు. అంతా సవ్యంగా జరిగితే జనవరి 2019లో వివాహం జరిగే అవకాశం ఉంది. కాగా సౌందర్య రజనీకాంత్ పెళ్లి వార్త ప్రస్తుతం మీడియాలో వైరల్ అయింది. అయితే అటు సౌందర్య కుటుంబ సభ్యులు గానీ, ఇటు విషాగన్ తరఫు వాళ్లుగానీ ఈ వార్తలపై స్పందించలేదు.

Untitled Document
Advertisements