కూటమిలోని పార్టీ అభ్యర్దులకు రెబల్స్ బెడద

     Written by : smtv Desk | Wed, Nov 14, 2018, 07:16 PM

కూటమిలోని పార్టీ అభ్యర్దులకు రెబల్స్ బెడద

హైదరాబాద్, నవంబర్ 14: తెరాస కు వ్యతిరేఖంగా ఏర్పడిన మహాకూటమిలో సిపిఐ పార్టీకి ప్రారంభం నుండి పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. పార్టీకి కోరుకునన్ని సీట్లు దక్కలేదు. పూర్తిగా తెగితే అసలుకే మోసం వస్తుందని 3 సీట్లు, రెండు ఎమ్మెల్సీ సీట్లకు వొకే చెప్పిన సీపీఐకి కాంగ్రెస్ పార్టీ రెబల్స్ బెడద పట్టుకుంది. ఎర్రపార్టీకి కేటాయించిన మూడు సీట్లలో హుస్నాబాద్ వొక్కటి. ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డికి కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి భయం పట్టుకుంది.

2014 లో హుస్నాబాద్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ నేత అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ దాఖలు చేశారు. కమ్యూనిస్టులు కంగు తిన్నారు. టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే వడితెల సతీష్ కుమార్ పోటీలో ఉన్నందున కాంగ్రెస్ రెబల్ కూడా పోటీ చేస్తే తమకు నష్టమని వామపక్షాలు వాపోతున్నాయి. కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగి ప్రవీణ్ రెడ్డిని పోటీ నుంచి తప్పించాలని కోరుతున్నారు. కేవలం సీపీఐ మాత్రమే కాకుండా కూటమిలోని మిగతా పార్టీ అభ్యర్థులకు కూడా రెబల్స్ బెడద పట్టుకుంది.





Untitled Document
Advertisements