మా ప్రేమను బాబుగారు స్వీకరిస్తారా : కేటిఆర్

     Written by : smtv Desk | Wed, Nov 14, 2018, 07:29 PM

మా ప్రేమను బాబుగారు స్వీకరిస్తారా : కేటిఆర్

హైదరాబాద్, నవంబర్ 14: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వొకరినొకరు తిట్టుకోవడం, అవసరమైతే ఆప్యాయంగా పిలుచుకోవడం మొదలుపెట్టేసారు. ప్రతీసారి ఇదే తంతు అవడంతో ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. తాజాగా తెరాస మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ సత్తుపల్లిలో మహాకూటమి అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యకు ఓటు వేస్తే సీతారామ ప్రాజెక్టు ఆగిపోయినట్లేనని చెప్పి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పిడమర్తి రవిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

అలాగే ‘మాకు ప్రేమించే హృదయం వుంది. పక్కవారిని ప్రేమించాలని పెద్దవాళ్లు చెప్పారు. మేం ప్రేమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే వుంటాం. కానీ చంద్రబాబు గారు మా ప్రేమను స్వీకరిస్తారా? మహాకూటమికి చంద్రబాబు నోట్లు ఇవ్వొచ్చు, రాహుల్ గాంధీ స్వీట్లు ఇవ్వొచ్చు. కానీ ఓట్లు వేసేది మాత్రం ప్రజలే. మహాకూటమి నేతలు సీట్లు పంచుకునేలోపే మనం స్వీట్లు పంచుకుందాం. పిడమర్తి రవిని గెలిపించుకుందాం అని అన్నారు మంత్రి. మహాకూటమికి ఓటు వేస్తే గోదావరి జలాలను సత్తుపల్లికి తీసుకురావాలన్న లక్ష్యం కలగానే మిగిలిపోతుందని ఘాటుగా విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం గురుకుల పాఠశాలలు కట్టించిందని గుర్తు చేశారు కేటీఆర్.

Untitled Document
Advertisements