కాశ్మీర్ పై సంచలన వ్యాఖ్యానాలు చేసిన పాక్ మాజీ క్రికెటర్

     Written by : smtv Desk | Wed, Nov 14, 2018, 07:36 PM

కాశ్మీర్ పై సంచలన వ్యాఖ్యానాలు చేసిన పాక్ మాజీ క్రికెటర్

పాకిస్తాన్, నవంబర్ 14: కశ్మీర్ వివాదం గురించి పాక్ ప్రభుత్వం పై దేశ మాజీ క్రికెటర్ సాహిద్ ఆఫ్రిద్ సంచలన వ్యాఖ్యానాలు చేశారు. దేశంలో ఉన్న నాలుగు ప్రావిన్స్ లనే సరిగా చూసుకోలేకపోతున్నామని. ఇక మనకు కశ్మీర్ ఎందుకని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ గురించి పాకిస్థాన్ మరిచిపోవాలని. పాకిస్థాన్ ను మంచిగా చూసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.

బ్రిటిష్ పార్లమెంట్‌లో విద్యార్థులతో మాట్లాడుతున్న సందర్భంగా అఫ్రిది చేసిన ఈ వ్యాఖ్యలు వివాదానికి దారి తీసే పరిస్థితి కనిపిస్తున్నది. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి కూడా తమ ప్రభుత్వాలకు చేత కాలేదని అతను విమర్శించాడు. ఇక కశ్మీర్‌ను ఇండియాకు కూడా ఇవ్వొద్దని, లోయలో ప్రజలు చనిపోవడం తనను ఎంతగానో బాధిస్తున్నదని అఫ్రిది అన్నాడు.
కశ్మీర్ ను ఇండియాకు కూడా ఇవ్వొద్దని. అది ప్రత్యేక దేశం కావాలని అన్నాడు. కశ్మీర్ లో మానవత్వం పరిఢవిల్లాలని ఆకాంక్షించాడు. అఫ్రిది వ్యాఖ్యలు పాకిస్థాన్ లో వివాదాస్పదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలోనూ కశ్మీర్ అంశంపై స్పందిస్తూ.. అక్కడ భారత్ అమలు చేస్తున్న విధానాన్ని అతడు విమర్శించాడు. అయితే అప్పట్లో భారత క్రికెటర్ల నుంచి కూడా అఫ్రిది తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు.





Untitled Document
Advertisements