సిపిఐ అభ్యర్దుల జాబితా

     Written by : smtv Desk | Thu, Nov 15, 2018, 11:04 AM

సిపిఐ అభ్యర్దుల జాబితా

హైదరాబాద్, నవంబర్ 15: తెరాస కు వ్యతిరేఖంగా ఏర్పడిన మహాకూటమి లో భాగస్వామ్యమైన సిపిఐ కి కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలను కేటాయించింది. ఆ అభ్యర్దుల పేర్లను అధికారికంగా నిన్న సాయంత్రం విడుదల చేసింది.

హుస్నాబాద్ నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, వైరా నుంచి బానోతు విజయబాయి, బెల్లంపల్లి నుంచి గుండా మల్లేశ్ సిపిఐ అభ్యర్ధులుగా పోటీ చేయనున్నారు. వీరు ముగ్గురు ఈ నెల 17 లేదా 18వ తేదీన నామినేషన్లు వేస్తారని ఆ పార్టీ నేత పల్లా వెంకట్ రెడ్డి తెలిపారు. తాము పోటీ చేయబోతున్న స్థానాలలో కాంగ్రెస్‌, టిడిపిల నుంచి తిరుగుబాటు అభ్యర్ధులు బరిలో దిగకుండా నివారించవలసిన బాధ్యత ఆ రెండు పార్టీలదేనని అన్నారు. సిపిఐకి కేటాయించిన మూడు స్థానాలలో తప్పకుండా గెలుచుకొంటామని పల్లా వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements